Friday, November 22, 2024

మేం త‌ల్లిదండ్రులం కాబోతున్నాం.. ద‌ర్శ‌కుడు అట్లీ

త‌మ కుటుంబం పెద్దది అవుతోంద‌ని చెప్పారు త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ. బేబీబంప్ తో ఉన్న త‌న భార్య ప్రియ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి తాము త‌ల్లిదండ్రులం అవుతున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాల‌ని కోరారు. దాంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియ నటిగా కొన్ని ధారావాహికల్లో నటించారు. స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. కుటుంబసభ్యుల అంగీకారంతో 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement