న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం ప్రతిపాదించిన జడ్జీల నియామకాలపై విధించిన గడువుకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు కొలీజియం 104 మందిని ప్రతిపాదించిందని.. మూడు రోజుల్లోగా వివిధ న్యాయస్థానాలకు సూచించిన 44 మంది జడ్జీలను నియమిస్తాం. ఇందులో ఇక ఎలాంటి జాప్యం ఉండదని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
సర్వోన్నత న్యాయస్థానానికి ప్రతిపాదించిన ఐదుగురు జడ్జీల నియామకంపై జాప్యమేంటని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఏజీ.. ప్రస్తుతానికి ఈ అంశాన్ని వాయిదా వేయగలరా అని కోరగా.. సుప్రీం అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.