Tuesday, July 2, 2024

Parliament: అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం.. భవిష్యత్ అంతా భారత్ దే.. రాష్ట్రపతి

ఢిల్లీ: అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని, ఒక భవిష్యత్ అంతా భారత్ దేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశ ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతం అవుతారని ఆశిస్తున్నానన్నారు. ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించిందని రాష్ట్రపతి అన్నారు. పౌర విమానయాన రంగం అనేక మార్పులు తెచ్చామన్నారు. టైర్‌ 2, 3 నగరాల్లో విమానాశ్రయాలు నిర్మిస్తున్నామన్నారు.

సర్వీస్‌ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తోందన్నారు. ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. తమ ప్రభుత్వంలోనే భారత్‌ను అత్యున్నత జీవన ప్రమాణాలున్న దేశంగా తీర్చిదిద్దిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశాభివృద్ధి కృషి చేస్తోందన్నారు. అమృత కాలం మొదట్లో 18వ లోక్‌సభ కొలువుదీరిందన్నారు. దేశంలో సంస్కరణలు మరింత వేగంగా పుంజుకుంటాయన్నారు. రీఫార్మ్‌, ఫర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

- Advertisement -

ఐటీ నుంచి టూరిజం వరకు అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచ వృద్ధిలో భారత్‌ 15 శాతం భాగస్వామ్యం అవుతోందన్నారు. పంటలకు మద్ధతు ధర విషయంలో కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు.

ఈసారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవన్నారు. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుందన్నారు. జమ్ము కశ్మీర్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేశారన్నారు. దేశంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషమన్నారు.
సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారని, మీరంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement