Saturday, November 23, 2024

చైనాతో వాటర్ వార్..

న్యూఢిల్లి: భారత్‌-చైనా సరిహద్దులో అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద చైనా భారీ ప్రాజెక్టు నిర్మించనుందనే సమాచారంతో భారత్‌ అప్రమత్తమైంది. ఎగువ నుంచి వచ్చే వరదను అడ్డుకోడానికి ఓ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దేశంలోని అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అప్పర్‌ సియాంగ్‌ బహుళార్థక స్టోరేజ్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం, హైడ్రో పవర్‌ మేజర్‌ ఎన్‌హెచ్‌పీసీ ప్రీ ఫీజిబిలిటీ నివేదిక సమర్పించిన ట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్రహ్మపుత్ర నదీజలాలను ఆయుధంగా వాడుకొని మనదేశ రాష్ట్రాలు అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లు లక్ష్యంగా చైనా పన్నిన వ్యూహానికి భారత్‌ తరపున ఇది విరుగుడుగా భావించ వచ్చు.

చైనా ఇప్పటికే భారత్‌ ఈశాన్య ప్రాంతంలోకి టిబెట్‌ నుంచి ప్రవహించే నదులపై బీజింగ్‌ ఆనకట్టలు కట్టింది. దీంతో దిగువ ప్రాంతాలకు తీవ్ర వరద ప్రమాదం తప్పదు. భారత్‌కు ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో తాజాగా చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలోని మెడాగ్‌ వద్ద దాదాపు 60 వేల మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి సామ ర్ధ్యం ఉన్న భారీ డ్యామ్‌ నిర్మించేందుకు ప్రణాళికలు మొద లు పెట్టింది. చైనా చర్యలను నిశీతంగా పరిశీలిస్తున్న భారత్‌ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. చైనాకు చెక్‌ పెట్టేందుకు 11 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా దీనిని తీర్చిదిద్దనుంది. ఎన్‌ఈపీసీఓ లేదా అరుణాచల్‌ ప్రదేశ్‌ జాయింట్‌ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగు తోందని భావిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి హైడల్‌ పవర్‌ ఉత్పత్తి కేవలం ఒక ఉప ఉత్పత్తి. ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశ్యం చైనాలోని యార్లంగ్‌ త్సాంగ్పో నదికి ఆ దేశ నీటి మళ్లింపు పథకాన్ని ఎదుర్కోవడమే. యార్లంగ్‌ త్సాంగ్పో నది అరుణాచల్‌ ప్రదేశ్‌లో సియాంగ్‌గా, అసోంలో బ్రహ్మపుత్ర గా ప్రవహిస్తుంది. భారత్‌-నేపాల్‌తో సరిహద్దుల ట్రై- జంక్షన్‌గా దగ్గరగా గంగా ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త డ్యామ్‌ను నిర్మిస్తోంది. ఇది దిగువ నీటీ ప్రవాహాన్ని నియం త్రించడానికి ఉపయోగపడుతుందని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement