Tuesday, November 26, 2024

బేసిన్‌ అవతలి ప్రాంతాలకు నీటి తరలింపు క‌రెక్ట్ కాదు.. నీటి చ‌ట్టాల‌ను స‌వ‌రించాల‌న్న తెలంగాణ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బేసిన్‌ ప్రాంత అవసరాలను కాదని, బేసిన్‌లో లేని రాష్ట్రాలకు నీటిని మళ్లించేందుకు అనుమతివ్వాలన్న చట్ట సవరణ ఆక్షేపణీయమని జాతీయ వాటర్‌ వీక్‌ సదస్సులో తెలంగాణ స్పష్టం చేసింది. నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలో సామాజిక-ఆర్థిక, సమన్యాయంతో కూడిన సుస్థిర అభివృద్ధి – రివర్‌ బేసిన్‌ పరంగా పరిశీలన అంశాన్ని ప్రాథమిక యూనిట్‌గా తీసుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ వాటర్‌ వీక్‌ కార్యక్రమం న్యూఢిల్లిలోని గ్రేటర్‌ నోయిడాలో శనివారం ముగిసింది.

ఈ సదస్సులో తెలంగాణ నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. నదీ పరివాహక ప్రాంత ఒక స్థల పరిమితితో కూడిన అంశమని, రాజకీయ సరిహద్దులు కాలానుగుణంగా మార వచ్చని ఇంజనీర్లు స్పష్టం చేశారు. పరివాహక ప్రాంతంపై నియంత్రణ సాధించే ప్రభుత్వాలుమారినా నదీ పరివాహక ప్రాంత పరిమితి అన్ని కాలాల్లో స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. సదస్సులో తెలంగాణ ఇంజనీర్లు వీ. మోహన్‌ కుమార్‌, నల్లా విజయ కుమార్‌, ఎన్‌. రవిశంకర్‌, అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement