Saturday, November 23, 2024

ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద

నిజామాబాద్ లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతున్నది. ఆదివారం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కుండపోతగా వాన కురిసింది. దీంతో గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 61,310 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 7500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1090.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలకుగాను 87.561 టీఎంసీలు ఉన్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతున్నది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చింది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది.

ఇది కూడా చదవండి: మోసం చేసింది చాలు: ‘మా’ ఎన్నికలపై బండ్ల గణేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement