నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది వరద ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో వరద వస్తున్నది. ప్రస్తుతం ఇన్ఫ్లో 15,360 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 596 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1065.40 అడుగులు ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 20.895 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement