Wednesday, November 20, 2024

జ‌లాశ‌యాల‌కు జ‌ల‌క‌ళ‌..

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి సాగర్‌కు 76,495 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,992 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 591 అడుగులు, ప్రస్తుతం 541 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, ఇప్పుడు 190.41 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు 62,391 క్యూసెక్కులు వస్తుండగా, రెండు గేట్ల ద్వారా 1,15,876 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 882.20 అడుగులు ఉన్నది.

శ్రీశైలంలో 215 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 200 టీఎంసీల నీరునిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలోకి 47 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. 42,621 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, ప్రస్తుతం 317 అడుగులు ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలకుగాను 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement