అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రం లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్ధను ఏర్పాటు- చేసింది. ఇందులో 1.67 లక్షల మంది ఉద్యోగులు వివిధ కార్యదర్శుల రూపంలో బాధ్యత లు నిర్వర్తిస్తున్నారు. వీరికి రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ కూడా ఖరారు చేసింది. అయితే ఇప్పుడు మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బదిలీల వ్యవహారం తెరపైకి వస్తోంది. దీంతో ప్రభుత్వం తీసుకొ బోయే నిర్ణయం కీలకంగా మారబోతోంది. కాగా, ప్రాథమికంగా అందుతున్న సమాచా రం మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బదిలీల కు అవసరమైన విధివిధానాలను రూపొందించా లని కూడా అధి కార యంత్రాంగానికి ప్రభు త్వం ఆదేశాలు జారీచేసి నట్లు తెలు స్తోంది. అయితే, ఈప్రక్రియ ఈ నెలాఖ రులోగానీ, వచ్చేనెల మొదటి వారం లోగానీ ప్రారం భమవు తుందని తెలు స్తోంది. బదిలీలను ఏఏ అంశాల ప్రాతిపదికన చేపట్టాలన్న దానిపై కూ డా చర్చ ప్రార ంభమైనట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా నాలుగు కేటగిరీల్లో వీరి బదిలీల ప్రక్రియ నిర్వ హించేలా కార్యాచరణ సిద్ధంచేశారని అంటున్నారు.
మూడేళ్లుగా ఇబ్బందులు…
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మూడేళ్లు గా బదిలీలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని గ్రామ, వార్డు స చివాలయ ఉద్యోగ సంఘాలు పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. గ్రామ వాలంటీ-ర్, వార్డు వాలం టీ-ర్, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్‌ను కలిసిన పలు యూ నియన్ల ప్రతినిధులు సచివాలయాల్లో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా నాలుగు కేటగిరీల ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యో గులకు కూడా తక్షణమే సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరారు.
బదిలీలు వీరికే..
సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ సమయంలో నాన్ లోకల్ జిల్లాలలో ఎక్కువ ఉద్యోగాలు నోటిఫై చేయడంవలన అక్కడ పరీక్ష రాసి ఉద్యోగం పొందిన ఉద్యోగస్తులు ప్రతిరోజూ వందల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు వారికి వెంటనే బదిలీల అవకాశం కల్పించాలని ఉద్యో గులు కోరారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులకు వెంటనే బదిలీల అవకాశం కల్పించా లని కోరారు. మరోవైపు భర్త, భార్య వేరు వేరు జిల్లాలో ఉద్యోగాలు చేస్తు వారు తల్లిదండ్రులకు పిల్లలకు దూరంగా ఉంటూ మూడేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నా రని, వారిని కూడా కరుణించా లన్నారు. కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన వారి కోసం, మానసిక, శారీరిక అంగ వెకల్యంతో బాధపడుతున్న టు-వంటి పిల్లల తల్లితండ్రులకు కూడా బదిలీలు అవసరమని తెలిపారు.
సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?
ఈ కేటగిరీలతో పాటు- మొత్తం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని ఉద్యోగ ప్రతినిధులు కొరుతు న్నారు. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్.. ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు, సెలవు లు, జీతభత్యాలు, అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వీరి బదిలీలపైనా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో ఆరునెలలు ఆగితే ఎన్ని కల ఏడాదిలోకి ప్రవేశించే అవకాశముంది. కాబట్టి త్వరలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు- తెలుస్తోంది.