Monday, January 27, 2025

Warangal – ఆటో, కార్లపై లారీ బోల్తా – ముగ్గురి దుర్మరణం

వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాల పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

స్తంభాల కింద రెండు ఆటోలు ఉన్నాయి. ఆ ఆటోలు బయటకు తీస్తే అందులో ఇంకెంతమంది ఉన్నారనే విషయం బయటపడుతుంది.

కాగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement