పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే వరంగల్ ఖమ్మం నల్గొండ లో పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. కాగా ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత లో మెజార్టీ ఓట్లు లేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మొత్తం 3,87,969 ఓట్లు పోల్ అవ్వగా ఇందులో 21,636 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్‌కు 27,588 ఓట్లు పోల్ అయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.