Friday, November 22, 2024

వరంగల్ డీసీసీబీ బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ కావాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

హనుమకొండ : లాభాల బాటలో పయనిస్తూ అనేక అవార్డులను పొందుతున్న వరంగల్ డీసీసీబీ బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ బ్యాంకుగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. వరంగల్ డీసీసీబీ బ్యాంక్ డైరీ, క్యాలెండ‌ర్ ని మంత్రి ఆవిష్కరణ చేసి అందరికీ శుభాకాంక్ష తెలిపారు. ఈ సంద‌ర్భంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… ఈ బ్యాంక్ చైర్మన్ గా గతంలో పని చేసినందుకు ఈ బ్యాంక్ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రజలకు, రైతులకు సేవ చేసేందుకు ఈ బ్యాంక్ మంచి అవకాశం ఉన్న‌ద‌న్నారు. అవినీతి ఆరోపణలున్న వారు డైరెక్టర్‌ కోసం కొందరు వచ్చినా.. నేను ఆమోదించలేదు. పాలక వర్గం మంచిది కావాలని అనుకున్నాను, ఎమ్మెల్యేలు కూడా అలాంటి ప్రతిపాదనలే చేశారు అన్నారు. సేవా భావంతో పని చేయాల‌ని, దీనితో రాజకీయ భవిష్యత్ ఉంటుంద‌న్నారు. నేను అప్పట్లో జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ కావాలి అనుకున్నా.. కానీ కుల సమీకరణల వల్ల డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా ఇస్తున్నా అని నాటి సీఎం ఎన్టీఆర్ చెప్పారు. బ్యాంక్ చైర్మన్ గా నేను సేవ చేశాను, ఆంధ్రలో ఉన్న బ్యాంక్స్ రికవరీ చూసి బాధ పడేవాన్ని అన్నారు. అక్కడ 80 శాతం రికవరీ ఉండేది, మన దగ్గర ఒకటి, రెండు బ్యాంక్ లలోనే అలాంటి రికవరీ ఉండేది అన్నారు. కానీ నేడు మన బ్యాంక్ వారి కంటే రికవరీలో చాలా ముందుందన్నారు. బ్యాంక్ అభివృద్ది కోసం ఎక్కడా రాజీ పడకుండా పని చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పోల్చుకుని మాకు సరైన గౌరవం లేదు అని బాధ పడాల్సిన అవసరం లేద‌న్నారు. మీకు సరైన గౌరవం కల్పించే కృషి చేస్తాం అన్నారు. చైర్మన్లకు గౌరవ వేతనం ఇస్తూ, గౌరవం ఇవ్వాలని నేను, మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్ ని అడిగాం,
సీఎం గారు కూడా ఒప్పుకున్నారు అన్నారు. ప్రోటోకాల్ కూడా ఇస్తాను అన్నారు. మళ్ళీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఏ విధమైన ప్రోటోకాల్ ఇస్తే బాగుంటుంది అని అడుగుతాం, బ్యాంక్ లో డిపాజిట్లు కూడా పెంచినందుకు అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. నూతన పాలక వర్గాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను, బ్యాంక్ సహకార స్ఫూర్తి గొప్పది అన్నారు. అసంఘటిత కార్మికులను ఏకం చేసి 60 సంఘాలు చేశామ‌ని, వారికి రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గొప్ప చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ నగర ప్రజలకు సహకారం అందించాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement