Saturday, November 23, 2024

బిల్‌గేట్స్ ఫౌండేష‌న్‌కు వారెన్ బ‌ఫెట్ రాజీనామా..

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేష‌న్‌కు వారెన్ బ‌ఫెట్ రాజీనామా చేశారు.  బిల్‌గేట్స్‌, మిలిందా గేట్స్‌లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెబుతూ… విడాకులు తీసుకోవడంతో… ఆ ఫౌండేష‌న్‌లో కొన‌సాగ‌కూడ‌ద‌ని బ‌ఫెట్ నిర్ణ‌యించుకున్నారు.  ట్ర‌స్టీలో ఉన్న‌ప్ప‌టీకీ, క్రియాశీలంగా లేన‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని బ‌ఫెట్ పేర్కొన్నారు. త‌న బ‌ర్క్‌షైర్ హాత్‌వే షేర్ల‌ను సేవా కార్యక్ర‌మాల‌కు వినియోగించాల‌నే లక్ష్యం స‌గానికిపైగా పూర్త‌యింద‌ని తెలిపారు.  ముగ్గురు స‌భ్యులున్న బోర్డులో బ‌ఫెట్ కూడా ఒక‌రు. కాగా… ఈ  పపదిహేనేళ్ళళ్లో ఈ ట్ర‌స్ట్ ద్వారా 27 బిలియ‌న్ డాల‌ర్ల‌ను సేవా కార్య‌క్ర‌మాల కోసం వినియోగించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ఫెట్ ఐదు సేవా సంస్థ‌ల‌కు 41 బిలియ‌న్ డాల‌ర్ల‌ను విరాళంగా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement