Monday, September 30, 2024

War Zone – రూటు మార్చిన ఇజ్రాయేల్ … ఇక హైతీ పై నిప్పుల వాన‌

పాల‌స్తీనా, లెబనాన్ ల‌లో మాన‌వ హ‌న‌నం
ఇటు హ‌మాస్ , అటు హిజ్బుల్లాను దెబ్బ‌దీసిన ఇజ్రాయేల్
తాజాగా హైతీ ఉగ్ర‌వాదుల‌పై పంజా
యెమ‌న్ లో బాంబులు వ‌ర్షం
పోర్టులు స‌ర్వ‌నాశ‌నం.. విద్యుత్ కేంద్రాలు ధ్వంసం
టెల్ అవివ్‌లో హైతీ తీవ్ర‌వాదుల మిస్సైల్స్ దాడి
ప్ర‌తికారంగా రంగంలోకి దిగిన‌ ఇజ్రాయేల్ జెట్ ఫైట్స్
దాడిలో ఇప్ప‌టికే 10 మంది మృతి..

రెండు వారాలుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సాగిస్తోన్న భీకర దాడులు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్ తన రూటు మార్చింది. దాడుల తీవ్రతను మరింత పెంచింది. దాన్ని పొరుగు దేశాలకు విస్తరింపజేసింది. ఇక కొత్తగా యెమెన్‌పై యుద్ధానికి దిగింది. మిస్సైళ్లు, బాంబుల వర్షాన్ని కురిపించింది. నిన్నటి వరకూ కూడా లెబనాన్‌ను ఊపిరి తీసుకోనివ్వలేదు ఇజ్రాయెల్. రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాను నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో సాగిన వైమానిక దాడులు అవి. తాను అనుకున్న లక్ష్యాన్ని ఇజ్రాయెల్ సాధించింది కూడా.

- Advertisement -

బీరూట్‌ దక్షిణప్రాంతంపై సాగించిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం అయ్యారు. ఆయనతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, ఇతర కమాండర్లు కూడా మృతిచెందారు. హెజ్బొల్లాకు కంచుకోటగా భావించే దహియా ప్రాంతాన్ని నేలమట్టమైంది.

ఇప్పుడు తాజాగా తన దాడులను యెమెన్‌కు విస్తరించింది ఇజ్రాయెల్. హౌతీ స్థావరాలపై విరుచుకుపడుతోంది. హౌతీ ఆధీనంలో ఉన్న పోర్టులు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. ఈ ఘటనలో10 మంది సాధారణ పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు.


హౌతీ అలియాస్ అన్సర్ అల్లా అనేది షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ అండ్ మిలటరీ ఆర్గనైజేషన్. 1990లో యెమెన్‌లో ఇది ఏర్పాటైంది. జైదీ షియాలు దీన్ని స్థాపించారు. హౌతీ మూమెంట్‌గా పిలుస్తుంటారు. పొరుగునే ఉన్న ఒమన్, లిబియాల్లో అధికారంలో రావాలనేది దీని లక్ష్యం. రెడ్ సీ, గల్ఫ్‌ ఆఫ్ ఏడెన్‌పై పూర్తి పట్టు సాధించడానికి ఈ మధ్యకాలంలో తరచూ దాడులను సాగిస్తూ వస్తోంది.


లెబనాన్‌లో తన లక్ష్యం పూర్తి కావడంతో ఇక హౌతీపై దృష్టి సారించింది ఇజ్రాయెల్. హౌతీ ఆధీనంలో ఉన్న రస్ ఐసా, హొడెయిడా పోర్టులపై బాంబుల వర్షాన్ని కురిపించింది. విద్యుత్ కేంద్రాలనూ వదల్లేదు. ప్రధాన ఆదాయ వనరు కావడం వల్ల పోర్టులను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకున్నట్లు చెబుతున్నారు.


ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌లో గల బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌ను సంధించినట్లు యెమెన్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అటాక్ విజయవంతమైనట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement