కీవ్: ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా భీకర దాడి చేసింది. కీవ్‌ను టార్గెట్ చేస్తూ భారీ సంఖ్యలో మిస్సైళ్ల ప్రయోగించింది. అయితే రష్యా ప్రయోగించిన 75 టార్గెట్లలో 67 ఆయుధాలను తమ వైమానిక దళం కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ వలేరి జాలుజ్నియి దీనిపై ప్రకటన చేశారు. రష్యా ప్రయోగించిన వాటిల్లో 37 క్రూయిజ్ మిస్సైళ్లు , 29 షాహిద్ డ్రోన్లు ఉన్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌కు చెందిన మిలిటరీ కేంద్రాలు, కీలక ప్రదేశాలను క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లతో రష్యా అటాక్ చేసిందని ఆయన తెలిపారు. శత్రు దేశం సుమారు 40 వరకు Kh-101/Kh-555 క్రూయిజ్ మిస్సైళ్లను తొమ్మిది టీయూ-95ఎంఎస్ స్ట్రాటజిక్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగించినట్లు వలేరి తెలిపారు. ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి ఇరాన్‌కు చెందిన షాహిద్-136, 131 యూఏవీలతో రష్యా అటాక్ చేసిందని, మొత్తం 35 సార్లు డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ కమాండ్ తెలిపారు. కీవ్ దిశగా వచ్చిన అన్ని టార్గెట్లను ధ్వంసం చేశామని, కొన్ని బిల్డింగ్‌లు డ్యామేజ్ అయినట్లు కీవ్ పోలీసు అధికారి ఆండ్రూ నెబిటోవ్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement