ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా అనేక నగరాల్లో పేలుళ్లు వినిపించాయి..ఒడెస్సా, విన్నిట్సియా, జపోరిజియా, క్రెమెన్‌చుక్, డ్నిప్రో, ఖ్మెల్నిట్స్కీ, క్రోపివ్‌నిట్స్‌కీ, క్రివీ రిహ్, లుత్స్క్‌లతో సహా అనేక ఉక్రేనియన్ నగరాలపై రష్యా దళాలు దాడులు ప్రారంభించాయి. ఉత్తర-పశ్చిమ ఉక్రెయిన్‌లోని లుట్స్క్ నగర మేయర్ ఇహోర్ పోలిష్‌చుక్ మాట్లాడుతూ.. భవనంపై దాడిలో గాయపడిన మహిళ మరణించినట్లు సమాచారం.
రష్యాపై 9/11 తరహా దాడి..
ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్ సైన్యం ఇటీవల రష్యాపై పలు దాడులు నిర్వహించగా, తాజాగా సరతోవ్‌లోని 38 అంతస్తుల భవనంపై దాడి చేసింది. రష్యా సరిహద్దుకు 2300 కిలోమీటర్ల దూరంలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల భవనంపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ దాడి తరువాత, నగరం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడిని అమెరికా 9/11 దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం సామర్థ్యాలను బహిర్గతం చేసింది. వారు రష్యా సరిహద్దులో వేల కిలోమీటర్ల దూరంలో కూడా దాడి చేయగలరని నిరూపించింది.. ఈ దాడి తర్వాతే రష్యా ప్రతికారేచ్చతో ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించింది.