వారం రోజుల విరమణకు తెర పడటంతో గాజా స్ట్రిప్ మళ్లీ కాల్పులతో దద్దరిల్లుతోంది. విరామం అనంతరం ఇజ్రాయెల్ రెట్టించిన తీవ్రతతో మళ్లీ దాడులకు దిగింది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుపడిందిదీంతో ఖాన్ యూనిస్‌లో ఒక భారీ భవన సముదాయం నెలమట్టమైనట్లు తెలుస్తోంది. హమాద్లో కూడా ఒక అపార్ట్‌మెంట్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల్లో గాజాలో కనీసం 178 మంది మరణించినట్లు హమాస్ తాజాగా ప్రకటించింది
‘యుద్ధ లక్ష్యాల సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. బందీలందరినీ విడిపించుకోవడం, హమాస్‌ను నిర్మూలించడం, గాజా మరెప్పుడూ ఇజ్రాయెలీలకు ముపపుగా మారకుండా కట్టుదిట్టటమైన చర్యలు తీసుకునే దాకా సైనిక చర్య కొనసాగుతోంది’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది.
మహిళా బందీలందరినీ వదిలేస్తామన్న ఒప్పంద వాగ్దానాన్ని హమాస్ ఉల్లంఘించడం వల్లే దాడులను తిరిగి మొదలు పెట్టాల్సి వచ్చిందని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయెలే రక్త దాహంతో తమ ప్రాతిపాదనలన్నింటినీ బుట్టదాఖలు చేసి దాడులకు దిగిందని హమాస్ రోపించింది.