Sunday, November 24, 2024

War – ఇరాన్‌కు విమానాలు బంద్… ఎయిరిండియా నిర్ణ‌యం

ఇజ్రాయేల్-ఇరాన్ మ‌ధ్య యుద్ద మేఘాలు
ఏ క్ష‌ణంలోనైనా ఇరాన్ దాడి చేసే అవ‌కాశం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
రంగంలోకి ఆమెరికా యుద్ద విమానాలు, నౌక‌లు

డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతుందన్న అంచనాలు పశ్చిమాసియాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.దాంతో ఐరోపాకు వెళ్లే విమానాలు సుదీర్గ మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఇతర దేశాల సంస్థలు కూడా ఇదే బాటపట్టాయని మీడియాలో కథనాలు వ‌స్తున్నాయి.

రంగంలో అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు

ఇజ్రాయెల్‌కు సాయంగా ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తో పాటూ యుద్ధ విమానాలను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను పెంటగాన్‌ రంగంలోకి దింపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు మధ్యదరా సముద్రంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరాయి. భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని ఈ నౌకల ద్వారా పంపుతోంది. అంతే కాదు ఈ యుద్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంచింది. ఒకవైపు యద్దం వద్దంటూ ఇజ్రాయేల్ కు అమెరికా న‌చ్చ‌జేపుతూనే భారీగా ఆయుధ‌సాయం చేస్తున్న‌ది .

- Advertisement -

సిరియాపై ఇజ్రాయేల్ దాడితోనే. టెన్ష‌న్

కాగా, కొద్ది నెలలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో తమ సీనియర్ కమాండర్లు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఇది బెంజమిన్ నెతన్యాహూ సేనల పనేనని, ఈ నేరానికి వారు పశ్చాత్తాపపడేలా చేస్తామని ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖొమేనీ హెచ్చరించారు. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement