Friday, November 22, 2024

Waqf Bill l జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు

ఢిల్లీ : వక్ఫ్‌ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం పలువురు ప్రతిపక్ష ఎంపిలు బహిష్కరించారు. కమిటీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ఎంపిలు గౌరవ్‌ గొగోరు, ఇమ్రాన్‌ మసూద్‌, డిఎంకె ఎంపి ఎ. రాజా, శివసేన (యుబిటి) ఎంపి అరవింద్‌ సావంత్‌, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ, సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపి మొహిబుల్లా, ఆప్‌ ఎంపి సంజరు సింగ్‌లు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.

.తమ తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రతిపక్ష సభ్యులు అనంతరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌ని సంప్రదించవచ్చని ఇద్దరు ఎంపిలు సూచించారు. బిల్లుని పరిశీలిస్తున్న పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఎంపి అరవింద్‌ సావంత్‌ మీడియాతో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement