న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న ఎలాన్‌మస్క్ తాజాగా ప్రముఖ శీతల పానీయ సంస్థ కోకాకోలాను టార్గెట్ చేశాడు. కోకాకోలా సంస్థను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు మస్క్ ట్వీట్ చేసి సంచలనం లేపాడు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను నియంత్రణలోకి తీసుకున్న తర్వాత మస్క్ చేసిన ట్వీట్ వ్యాపారవర్గాల్లో సంచలనంగా మారింది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ప్రజల విశ్వాసాన్ని పొందాలని మితవాదం లేదా వామపక్షవాదం అనే ఎటువంటి తారతమ్యం లేకుండా తటస్థవైఖరిని అనుసరించనున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో కోకాకోలాను తిరిగి కొకైన్ వైభవం తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా గతంలో కోకాకోలాను కోకా ఆకులు, కోలా గింజలతో తయారు చేసేవారు. కోలా గింజలు, కోలా ఆకుల నుంచి కెఫిన్ వస్తుంది.
కోకకోలా ఎక్కువగా కోలా ఆకులను వినియోగించే తయారుచేసేవారు. కోకా ఆకుల్లో సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ లభిస్తుంది. దీంతో ఈ డ్రింక్‌పై ఎన్నో అభ్యంతరాలు తలెత్తాయి. అప్పటినుంచి అమెరికాలో కోకాకోలా ఫార్ములా నుంచి కొకైన్‌ను తొలగించారు. అయితే కొకైన్‌ను మాదకద్రవ్యంగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల కోకకోలా డీ కోకైనేజ్డ్ కోలా ఆకులతో తయారు చేస్తున్నారు. కోకాకోలాను కొన్న తర్వాత అందులో తిరిగి కొకైన్‌ను చేరుస్తామంటూ మస్క్ ట్వీట్ చేశారు. కాగా గతంలో మెక్‌డోనాల్డ్స్‌ను కొనుగోలు చేస్తానంటూ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..