ఉడుతలు చేసిన ఓ పనికి ఓ కారు ఓనర్ అవాక్కయ్యాడు. సాధారణంగా ఉడతలు వర్షాకాలంలో ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. ఆహారాన్ని సేకరించి పెట్టుకున్నాక వాటిని చలి కాలంలో వాడుకుంటాయి. చిన్న చిన్న గుంతలు తీసి, లేదా ఎక్కడైనా ఇంట్లోనో ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. నార్త్ డకోటాలో నివశించే ఫిషర్ నాలుగురోజులపాటు కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత తన కారు ఇంజన్ భాగాన్ని చెక్ చేసేందుకు బానెట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏకంగా 152 కేజీల వాల్‌నట్స్ కనిపించారు. దీంతో ఫిషర్ షాక్ అయ్యాడు. వెంటనే కారులోని వాల్‌నట్స్‌ను తీసి చిన్న చిన్న బాక్సుల్లో ఉంచాడు. వాటిని భద్రంగా పక్కన పెట్టాడు. ఎర్రని ఉడతలు ఈ స్థాయిలో వాల్‌నట్స్‌ను సేకరిస్తుంటాయని, చలికాలంలో వాటికి ఆహారం దొరకదని, చలికాలంలో బయటకు రాకుండా దాచుకున్న ఆహారాన్ని స్వీకరిస్తుంటాయని ఫిషర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మమతా బెనర్జీ గెలిచింది- మోడీ రాజీనామా చేస్తారా..? : ఎమ్మెల్సీ కవిత..