Friday, November 22, 2024

Delhi: లోక్‌సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్..

లోక్‌సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఇవాళ‌ లోక్‌సభ ప్రారంభ అవ్వగానే కొత్త క్రిమినల్ చట్టాలు, నీట్, యూజీసీ, ఎన్‌టీఏ వైఫల్యంపై విపక్షాలు అందజేసిన వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులకు స్పీకర్‌కు మధ్య వాదన కొనసాగింది. అదేవిధంగా సభలో శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్ అవ్వడంపై ఓం బిర్లాను విపక్ష సభ్యులు ప్రశ్నించారు. అందుకు సమాధానంగా స్పీకర్ ఓం బిర్లా క్లారిటీ ఇచ్చారు.

మైక్ కంట్రోల్ చేయడం సభాపతి చేతిలో ఉండదంటూ కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కొత్త క్రిమినల్ చట్టాలు, నీట్, యూజీసీ, ఎన్‌టీఏ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా స్పీకర్ అంగీకరించకపోవడంతో వాకౌట్ ప్రకటించారు. అనంతరం వారంతా పార్లమెంట్‌ బయటకు వచ్చి అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులను పరదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆ వెంటనే మెయిన్‌ గేట్‌ దగ్గర ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement