Wednesday, November 20, 2024

Wajedu – ముంచెత్తిన వరద : తెలంగాణ – ఛత్తీస్గడ్ మ‌ధ్య రాకపోకలు బంద్

వాజేడు – బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్, కడెం, సమ్మక్క సారక్క తుపాకులగూడెం బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తివేసి దిగువ ప్రాంతానికి వరద నీరు విడుదల చేశారు. దీంతో గోదావరి ఉధృతంగా పెరుగుతుంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద 15 మీటర్లకు చేరుకుంది.

దీంతో టేకులగూడెం వద్ద 163 వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ ఛత్తీస్గడ్ అంతర్ రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ భారీ గేట్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ప్రవాహానికి వాగులు వంకలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మర్రి వాగు, కొంగలవాగు బ్రిడ్జిలు నీట మునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement