Monday, November 18, 2024

ఖమ్మంలో వాడ వాడ పువ్వాడ..! ఘన స్వాగతం పలికిన ప్రజలు..

ఖమ్మం సిటీ : వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 6వ డివిజన్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉదయాన్నే పర్యటించారు. ప్రజలు హారతులతో డివిజన్ లోకి స్వాగతం పలికారు. తమ సమస్యలు విన్నవించెందుకు డివిజన్ ప్రజలు మంత్రి పువ్వాడ కొరకు ఎదురు చూసి తమ బాధలు, స్థానిక ఇబ్బందులు చెప్పుకుంటే తీరిపోతాయి ధీమాగా తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక సంఖ్యలో స్ధానిక ప్రజలు తమకు రోడ్లు, సైడ్ డ్రెయిన్లు కావాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడం కాకుండా వీధి దీపాలు కూడా వెలగట్లేదు అని, మరి కొన్ని చోట్ల అసలు దీపాలే లేవని వివరించారు. స్ధానిక చర్చ్ వద్ద కాల్వ నీరు రోడ్డు పైకి వస్తుందని ప్రజల ఫిర్యాదు మేరకు తక్షణమే ఇక్కడ కల్వర్టు నిర్మాణంకై ప్రతిపాదనలు చేసి నిర్మించాలని ఆదేశించారు.

తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేసి దీపాలు లేని చోట దీపాలు ఏర్పాటు చేయలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, గుంతల పూడిక, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యల పరిష్కారించలని మంత్రి పువ్వాడ ఆదేశించారు. అర్హులై ఉండి, చిన్న చిన్న సమస్యలు ఉండి ఆసరా పెన్షన్ పొందలేని వారికి తగు సూచనలు చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేయలని మంత్రి అదేశించారు. ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధితో పేదలకు ఆసరాగా ఉండేందుకు ఆసరా పెన్షన్ ను ఇస్తుంటే ఆయా ఫలాలను అధికారులు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలుత డివిజన్ లో ప్రధాన డ్రెయిన్ల అవసరతను గుర్తించి వాటికి ప్రతిపాదనలు సిద్దం చేయలని, శిధిలమైన కొన్ని చోట్ల సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ నాగండ్ల కొటి, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ డిఇ రమేష్, మున్సిపల్ డీఈలు, ఏఈలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement