Sunday, November 24, 2024

W-T20 WC | ప్ర‌పంచక‌ప్ వేదిక మారింది.. లేటెస్ట్ షెడ్యూల్ ఇదే…

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ వెల్లడించింది. బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సిన ఈ టోర్నీ వేదికగా మారింది. ఈ క్రమంలో ఈరోజు (ఆగస్టు 26) టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ వెల్లడించింది. టీ20 ప్రపంచ కప్ వేదిక బంగ్లాదేశ్ నుండి UAEకి మారినట్టు ప్రకటించింది. కాగా, అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 30 వరకు మ్యాచ్‌లు జర‌గ‌నున్నాయి. అయితే, సెప్టెంబర్‌ 28 నుంచే ప్రాక్టీస్‌ మ్యాచులు జరుగనున్నాయి.

ఈ టోర్నీలో 10 దేశాలకు చెందిన మహిళా జట్లు తలపడనుండ‌గా.. అన్ని మ్యాచ్‌లు దుబాయ్, షార్జాలో జరుగుతాయి. ఐదు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, స్కాట్‌లాండ్‌ ఉన్నాయి. 17, 18 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు… 20న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

భార‌త మ‌హిళ‌ల‌ జ‌ట్టు షెడ్యూల్ ఇదే…

వార్మప్ మ్యాచ్‌లు:

భారత్ – వెస్టిండీస్‍ : సెప్టెంబర్ 29న‌ రాత్రి 7.30 గంటలకు
భార్ – దక్షిణాఫ్రికా : అక్టోబర్ 1న‌ రాత్రి 7.30 గంటలకు

గ్రూప్ మ్యాచ్‌లు:

- Advertisement -

భార‌త్ – న్యూజిలాండ్ : అక్టోబర్ 4న రాత్రి 7.30 గంటలకు
భార‌త్ – పాకిస్థాన్ : అక్టోబర్ 6న రాత్రి 7.30 గంటలకు
భార‌త్ – శ్రీలంక : అక్టోబర్ 9న రాత్రి 7.30 గంటలకు
భార‌త్ – ఆస్ట్రేలియా : అక్టోబర్ 13న రాత్రి 7.30 గంటలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement