Sunday, January 12, 2025

W – IND vs IRE | టీమిండియా సంచలనం… చిత్తుగా ఓడిన ఐర్లాండ్

  • రికార్డు స్కొర్ న‌మోదు…
  • మ‌రో మ్యాచ్ మిగిలుండ‌గానే 2-0తో సిరీస్ కైవ‌సం

స్వదేశంలో ఐర్లాండ్ మహిళల జట్టుతో జరుగుతున్న‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా మహిళల జట్టు కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈరోజు రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 116 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన… భారత సేన మరో మ్యాచ్ మిగిలుండగానే కప్పును చేజిక్కించుకుంది.

టీమిండియా రికార్డు స్కోరు

నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కళ్లు చెదిరే స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 370 పరుగులు సాధించింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. గతంలో మన అమ్మాయిల అత్యధిక స్కోర్‌ 358/2గా ఉంది. 2017లో ఇదే ఐర్లాండ్‌ జట్టుపై భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్‌లోనూ టీమిండియా, విండీస్‌పై కూడా ఇదే స్కోర్‌ (358/5) నమోదు చేయడం విశేషం.

- Advertisement -

టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్ (102) అద్భుత సెంచరీతో మెరిసింది. టాప్ ఆర్డర్ లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన (73), ప్రతిక రావల్‌ (67), హర్లీన్‌ డియోల్‌ (89) సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ 2, డెంఫ్సీ ఒక వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. మ్యాచ్ వన్ సైడ్‌గా మారిపోవడంతో ఆ జట్టు 7 వికెట్లు నష్టానికి కేవలం 254 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. కౌల్టర్ (80) మినహా పెద్దగా ఎవరూ రాణించలేక పోయారు. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రియా మిశ్రా 2, సాధు, సయాలి తలో వికెట్ తీశారు.

వన్డేల్లో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్లు

  • 370/5 ఐర్లాండ్‌పై (2025)
  • 358/2 ఐర్లాండ్‌పై (2017)
  • 358/5 వెస్టిండీస్‌పై (2024)
  • 333/5 ఇంగ్లాండ్ పై (2022)
  • 325/3 దక్షిణాఫ్రికాపై (2024)
  • 317/8 వెస్టిండీస్‌పై (2022)
  • 314/9 వెస్టిండీస్‌పై (2024)
  • 302/3 సౌతాఫ్రికాపై (2018)
Advertisement

తాజా వార్తలు

Advertisement