వ్యూహం రిలీజ్ ఆపేసిన హైకోర్టు సింగిల్ బెంచ్
కోట్ల నష్టం వచ్చిందని పిటిషన్ వేసిన నిర్మాత
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. సీఎం జగన్ కు అనుకూలంగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘వ్యూహం’ చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు. అయితే.. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రం విడుదలను ఆపేయాలని టీడీపీ యువనేత నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌పై స్టే విధించింది.
సింగిల్ బెంచ్ తీర్పుపై సవాల్..
ఈ నేపథ్యంలో.. చిత్ర నిర్మాత హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాజా పిటిషన్లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. సినిమా విడుదల కాకపోవడం వల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ లోనే ఆ విషయాన్ని తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.