Friday, November 22, 2024

VST ఫ్లై ఓవర్ కి ‘నాయిని నరసింహారెడ్డి’ పేరు – 19న కేటీఆర్ చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్ – . హైదరాబాద్ ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి శనివారం నాడు పురపాలక శాఖ మంత్రి. కె టీ ఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జిహెచ్ఎంసి స్టాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టింది..

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రివర్యులుగా పనిచేసిన కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కి పెట్టనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలను జారీ చేయనున్నది. సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి , అక్కడే ఉన్న విఎస్టి ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement