Tuesday, November 26, 2024

ఇంటి నుంచే ఓటు.. 80 ఏళ్లు పైబడిన అభ్యర్థుల కోసం సువిధ పోర్టల్‌..

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ అవకాశం వృద్ధులు, వికలాంగులకు మాత్రమేనని ప్రకటించింది. రాబోయే కర్ణాటక అసెంబ్లిd ఎన్నికలలో ఈ కొత్త విధానం అమలు చేయనున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లి పదవీకాలం మే 24తో ముగియనుంది. దీంతో మే మొదటి వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉందని ఆయన చెప్పారు. నోటిఫికేషన్‌ వెలువబడిన తర్వాత 80 ఏళ్లు పైబడిన వృద్ధులు లేదా వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసేవిధానం అమలవుతుందన్నారు. మొదటిసారి మేము కర్ణాటకలో 80 మందికి పైగా వికలాంగులకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే ఇక్కడ 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 17 వేల మంది వరకు ఉన్నారు. ఈ ఏడాది యువ ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. వృద్ధులు, వికలాంగుల కోసం ఫారం 12డి అందుబాటులో ఉంటుంది అని సీఈసీ తెలిపారు.

- Advertisement -

కర్ణాటకలో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం బృందం మూడు రోజులపర్యటనకు వెళ్లింది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌, సభ్యులు అనుఫ్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయెల్‌ ఈ పర్యటన కమిటీలో ఉన్నారు. ఎన్నికల సన్నాహాలపై శనివారం వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారిని పోలింగ్‌ బూత్‌లకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. అలాంటి వారు ఇక ఇంటినుంచే ఓటేయవచ్చు. ఈ ప్రక్రియ గోప్యంగా ఉంటుంది. మొత్తం ప్రక్రియ వీడియో గ్రాఫ్‌ చేయబడుతుంది అని సీఈసీ పేర్కొన్నారు. వికలాంగుల కోసం సాక్ష్యం అనే అప్లికేషన్‌ను తీసుకొస్తున్నాం.

ఇందులో లాగిన కావడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అలాగే పోటేచేసే అభ్యర్థుల కోసం సువిధ పోర్టల్‌ను అందుబాటులో ఉంచబోతున్నాం. దీనిద్వారా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అఫిడవిట్లు సమర్పించవచ్చు. ఎన్నికల సభలు, ర్యాలీలకు అవసరమైన అనుమతులకు దరఖాస్తులు కూడా దీనిద్వారానే చేసుకోవచ్చు అని సీఈసీ వివరించారు. ఓటర్లను జాగృతం చేసేందుకు, అభ్యర్థుల సమాచారం చేరవేసేందుకు నో యువర్‌ క్యాండిడేట్‌ (కేవైసీ) అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. 2018 అసెంబ్లిd ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉండగా, కాంగ్రస్‌ 78, జేడీ(ఎస్‌) 37 సీట్లు గెలుచుకున్నాయి. 224 సీట్లలో 36 ఎస్‌సీలకు 15 ఎస్‌టీలకు రిజర్వుచేయబడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement