విలాసవంతమైన కార్లు తయారు చేసే దిగ్గజ కంపెనీ.. ఓలో.. సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఓలో సంస్థకు చెందిన సబ్ బ్రాండ్ కంపెనీ పోలెస్టర్ దీన్ని రూపొందించింది. ఓ2 ఈవీ వాహన వివరాలను ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ కారు.. రోడ్‌స్టర్ కాన్సెప్ట్ హార్ట్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్ ్స కారు. తక్కువ ఎత్తు.. వెడల్పాటి బాడీ, టూ ప్లస్ టూ క్యాబిన్ డిజైన్, కనిష్ట ఓవర్ హాంగ్‌లతో పాటు పొడవైన వీల్‌బేస్‌తో.. ఆధునిక హంగులతో కారు క్లాసిక్ స్పోర్ట్ ్స లుక్‌లో ఆటో ప్రియులను ఆకర్శిస్తోంది.
ఏరో డైనమిక్ టెక్నాలజీని వినియోగించుకుంటూ.. అధిక మైలేజీ అందించేలా కంపెనీ ఓ2ను తయారు చేసింది. కారు వెనుక లైట్లు.. ఎయిర్ బ్లేడ్‌లుగా పని చేస్తాయి. అత్యుత్తమ కార్ బాడీ నియంత్రణ, అధిక దృఢత్వం, సహజమైన డైనమిక్‌లు బెస్పోక్ బాండెడ్ అల్యూమినియం ప్లాట్‌ఫామ్ ప్రయోజనాలను.. పోలెస్టార్ 5 నుంచి స్వీకరించబడ్డాయి. యూకేలోని పోలెస్టార్ ఆర్ అండ్ డీ బృందం దీన్ని అభివృద్ధి చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..