Wednesday, November 20, 2024

టెస్టింగ్‌లో వోక్స్​ వ్యాగన్‌ ఈవీ కారు..

వోక్సావ్యాగన్‌ గ్రూప్‌ ఇండియాలో విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టనుంది. స్కోడా బ్రాండ్‌ పేరుతో వీటిని మార్కెట్‌లోకి తీసుకు రానుంది. ఇప్పటికే కొన్ని మోడల్స్‌ను పరీక్షిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మౌలికసదుపాయాల కల్పన పూర్తయిన తరువాత ఈ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని తెలిపింది. మాస్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈవీ కార్లను తయారు చేస్తుందని వోక్సావ్యాగన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీయూష్‌ అరోరా వెల్లడించారు. ఇండియాలో విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్న విషయాన్ని కంపెనీ గుర్తించిందన్నారు. ఇప్పటికే కంపెనీ ఇండియా మార్కెట్‌లో ఫోర్సే టైకాన్‌ పేరుతో లగ్జరీ కారును, ఆడీ ఈ-ట్రాన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ రెండు బ్రాండ్‌ల అమ్మకాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఫోర్సే కారు ప్రారంభ ధర 1.5 కోట్లు, ఆడీ ఈ-ట్రాన్‌ ధర 99.99 లక్షల నుంచి 1.18 కోట్ల వరకు ఉంది.
వోక్సావ్యాగన్‌ స్కోడా బ్రాండ్‌తో తక్కువ ధరలో మాస్‌ మార్కెట్‌ కోసం విద్యుత్‌ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తుందన్నారు. టెస్టింగ్‌ పూర్తయిన తరువాత స్థానికంగానే ఈ కార్లను అసెంబుల్‌ చేసి విక్రయిస్తామని తెలిపారు.

ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్‌లో వోక్యావ్యాగన్‌, స్కోడా, ఆడీ, ఫోర్సే, లాంబొర్గినీ, బెంట్లీ బ్రాండ్‌ పేరుతో కార్లను విక్రయిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ కార్లకు, ఇతర వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందని ఆయన తెలిపారు. యూరోప్‌ దేశాల్లో 2035 నాటికి అన్ని విద్యుత్‌ వాహనాలే ఉండాలన్న లక్ష్యం పెట్టకున్నాయి. ఇక్కడ మార్కెట్లలో వేగంగా విద్యుత్‌ వాహనాలు వస్తున్నాయి. చైనా ఈ దిశలో చాలా పురోగతి సాధించిందని చెప్పారు. నార్త్‌ అమెరికా కూడా ఈవీ వాహనాలవైపు వేగంగా సాగుతుందన్నారు. ఇండియా మార్కెట్‌ చాలా సంక్షిష్టమైనది చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కంపెనీ విద్యుత్‌ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తుందన్నారు. ఇండియాలో 2030 నాటికి 30 శాతం విద్యుత్‌ వాహనాలు ఉండే అవకావం ఉందన్నారు. మౌళిక వసతుల అభివృద్ధిపై ఆధారపడి ఫోర్‌ వీలర్స్‌ రంగంలో విద్యుత్‌ వాహనాల పెరుగుదల ఆధారపడి ఉందన్నారు. 2025 నాటికి భారత మార్కెట్‌లో 5 శాతం వాటా సాధిం చే దిశగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. దేశ మార్కెట్‌లో విద్యుత్‌
కార్లతో పాటు సహాజ వాయువులతో నడిచే కార్ల అమ్మకాలు కూడా పెరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement