ఐస్‌లాండ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఐస్‌లాండ్‌లోని రెక్జాన్స్ ప్రాంతంలో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఐస్‌లాండ్ దేశంలో గత 48 గంటల్లో 1485 భూకంపాలు సంభవించాయి. ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం తాజా హెచ్చరిక జారీ చేసింది.
ఫలితంగా, ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వత వ్యవస్థకు సమీపంలో ఉన్న గ్రిందావిక్‌లోని 3,000 మంది నివాసితులను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏ సమయంలోనైనా అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించవచ్చని ఐస్‌లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ థోర్వాల్‌దుర్ థోర్డార్సన్ తెలిపారు.