వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ భారత్‌లోని గేమింగ్ కోసం వీ గేమ్స్‌ను విడుదల చేసింది. భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వైవిధ్యమైన గేమింగ్ అండ్ స్పోర్ట్స్ మీడియా కంపెనీ నజరా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. 1200కుపైగా ఆండ్రాయిడ్, హెచ్‌టీఎంఎల్ 5 ఆధారిత మొబైల్ గేమ్స్‌ను యాక్షన్, ఎడ్యుకేషన్, ఫజిల్, రేసింగ్, స్పోర్ట్స్‌లో పొందవచ్చు.ఈ సందర్భంగా వొడాఫోన్ ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఖోస్లా మాట్లాడుతూ భారతదేశంలో గణనీయంగా గేమింగ్ వినియోగం పెరిగిందన్నారు.
స్మార్ట్‌ఫోన్ల వినియోగం విస్తృతం కావడం 4జీ లభ్యతవంటివి గేమింగ్ కంటెంట్‌ను విస్తృతపరచాయన్నారు. నజారా టెక్నాలజీస్ ఫౌండర్, ఎండీ నితీష్ మిత్తర్‌సేన్ మాట్లాడుతూ ఇప్పటికే లక్షలాదిమంది మొబైల్ ఫోన్ల ద్వారా గేమ్స్ ఆడుతున్నారు. వొడాఫోన్ ఐడియాతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. వి గేమ్స్‌లో గేమింగ్ కంటెంట్ మూడు విభాగాలు ఉన్నాయని..ప్లాటినమ్ గేమ్స్, గోల్డ్‌గేమ్స్, ఫ్రీగేమ్స్ వి యాప్‌ద్వారా లభ్యమవుతాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..