భారత్‌లోని సుప్రసిద్ధ టెలీకం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) ఎ5జీ నెట్‌వర్క్స్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ విషయాన్ని వీఐఎల్ గురువారం వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో ఇండస్ట్రీ 4.0..స్మార్ట్ మొబైల్ ఎడ్జ్ కంప్యూటింగ్‌ను భారతదేశంలో సాధ్యం చేయునున్నామని తెలిపింది. కాగా వీఐఎల్-ఎ5జీ నెట్‌వర్క్‌లు సంయుక్తంగా ముంబైలోని ఓ ప్రైవేట్ పైలెట్ ప్రాజెక్టును తమ ప్రస్తుత 4జీస్ప్రెక్ట్రమ్‌ను వినియోగించి ఏర్పాటు చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్‌వేర్, వైట్‌బాక్స్ ఆర్‌ఎన్‌ఐ అంశాలను వినియోగించి పారిశ్రామిక ఆటోమేషన్ వినియోగాంశాలు, వ్యవస్థాపక వినియోగాలు, లో లాటెన్సీ వాతావరణం ఇతర నెట్‌వర్క్‌లతో అనుసంధానించడం ద్వారా ఏవిధంగా పనిచేస్తున్నాయో పరిశీలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్‌సింగ్ మాట్లాడుతూ తమ 5జీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఎ5జీ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. తమ సబ్‌స్క్రైబర్లకు అత్యుత్తమ సేవలను అందించడానికి, డిజిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఎ5జీ నెట్‌వర్క్ ఫౌండర్, సీఈవో రాజేశ్‌మిశ్రా అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..