Saturday, November 23, 2024

హంగామాతో వొడాఫోన్‌ ఐడియా ఒప్పందం.. అందుబాటులో 3.90లక్షల పాటలు

న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లోని వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. తమ అభిమాన పాటలను వినడం కోసం పలు యాప్‌లను డన్‌లోడ్‌ చేసుకోవడం, సబ్‌ స్క్రైబ్‌ చేసుకోవడం అవసరం లేదని తెలిపింది. సుప్రసిద్ధ టెలికామ్‌ బ్రాండ్‌ వి, ఇప్పుడు హంగామా మ్యూజిక్‌తో భాగస్వామ్యం చేసుకుందని, 3,90,000 తెలుగు, హిందీ పాటలను విభిన్నమైన జెనర్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఏపీ అండ్‌ తెలంగాణ, కర్నాటక క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్దార్థ్‌ జైన్‌ మాట్లాడుతూ.. వి.. ఇప్పుడు 20కుపైగా భారతీయ భాషల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన గీతాలను అందిస్తుందన్నారు. యాడ్‌లు లేని ఈ భారీ మ్యూజిక్‌ లైబ్రరీ వీ వినియోగదారులందరికీ వి యాప్‌ ఐ మొదటి ఆరు నెలలకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుందన్నారు.

వీ యాప్‌ ద్వారా.. వీ వినియోగదారులు అపరమిత డన్‌లోడ్స్‌ చేయడంతో పాటు మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌, తాజా బాలీవుడ్‌ న్యూస్‌, కాలర్‌ ట్యూన్స్‌ ఎంచుకోవడం వంటివి చేయవచ్చన్నారు. తెలుగు, హిందీ సంగీత అవకాశాలతో పాటుగా వీ యాప్‌పై హంగామా మ్యూజిక్‌ మరో 18 భాషల సంగీతాన్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. తమ వినియోగదారుల జీవితాలను సృజనాత్మక, వైవిధ్యమైన ఆఫరింగ్స్‌ అందించడం ద్వారా సమృద్ధి చేయడానికి వీ తీవ్రంగా శ్రమిస్తుంటుందన్నారు. వీ మ్యూజిక్‌ ద్వారా.. ఇప్పుడు తాము తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులు వీ యాప్‌లో చేరడంతో పాటు పూర్తి ఉచితంగా ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ సంగీతాన్ని ఆస్వాదించొచ్చు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement