Tuesday, November 19, 2024

వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న కరోనా

ఏపీలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు రెట్టింపవుతోంది. పలు జిల్లాల్లో వెయ్యికి పైగా రోజువారీ కేసులు వస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కోరాను బారిన పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.  విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో వారిరువురు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement