త్వరలోనే పరిపాలన రాజధానిగా వైజాగ్ కాబోతోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వెనుకబడిన జిల్లాల కోసమే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శాసనసభలో, శాసనమండలిలో తమకు బలం ఉందన్నారు. ‘‘వికేంద్రీకరణ బిల్లును త్వరలోనే పెడతాం.. ఎప్పుడు పెడతామో మీరే చూస్తారు కదా?’’ అని అన్నారు. అయితే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేసి అవుతున్నారని అన్నారు. జగన్ ఎలా అయినా గద్దె దించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ను ప్రజలు నమ్మరని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP)కి 175కి 175 స్థానాలు వస్తాయని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement