విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకం ఇక లాంఛనమే..అవును విశాఖ ఉక్కును అమ్మడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశ సమావేశాల్లో నిన్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనెత్తాడు…అయితే దీనిపై స్పందంచిన కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్ రావ్ కరాడ్ చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చాడు. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని ఏపీ ప్రభుత్వం కోరిందని, కానీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
విశాఖ స్టీల్‌లో పాటుగా దాని అనుబంధ సంస్థలు, సంయుక్త వ్యాపా భాగస్వామ్య సంస్థల్లో కేంద్రానికి ఉన్న వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు కరాడ్ సభలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ పాలసీని విడుదలనల చేసిందని, ఈ విధానం ప్రకారం సంస్థలను ప్రైవేటీకరించమో లేదంటే మూసేయడమో చేయాలని కరాడ్ తెలిపారు. ఇక, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో తమకున్న 100 శాతం వాటాను విక్రయించడం వలన ఆయా సంస్థల్లోకి గరిష్టస్థాయిలో పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాది అవకాశాలు పెరుగుతాయని భగవత్ కిషన్ రావ్ కరాడ్ తెలివిగా సమాధానం తెలిపారు.
ఇది కూడా చదవండి: చెవికి రిసీవర్, బనియన్ కు డివైస్.. హైటెక్ కాపీ కొడతూ పట్టుపడ్డ సౌరభ్