స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే..ఈ పిటిషన్ ను ఈ ఇవాళ హై కోర్టు విచారించింది. విచారణ ప్రారంభమైన అనంతరం దీనిపై కౌంటర్ దాఖలుకు వారం రోజుల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరఫు న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. కౌంటర్ దాఖలు విషయంలో కేంద్ర సర్కారు తాత్సారం చేస్తోందని చెప్పారు. ఈ నెల 29న బిడ్డింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందని వివరించారు. దీంతో బిడ్డింగ్ పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. అయితే, బిడ్డింగ్ వంటివి ఉండబోవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆగస్టు 2లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి : తిరుమల హుండీలో పాకిస్థాన్ కరెన్సీపై టీటీడీ ఈవో స్పందన