న్యూయార్క్ – అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కీలక నిర్ణయం ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్ ఎన్నికల్లో వివేక్ కేవలం 7.7 శాతం దక్కించుకున్నారు.. ఇక మాజీ అధ్యక్షుడు ఏకంగా 50.5 శాతం ఓట్లు సాధించి అందర్ని ఆశ్చర్యపరిచారు..
మరోసారి అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. తాను ఈ ఎన్నికలలో ట్రంప్ కు మద్దతు ఇస్తునట్లు వెల్లడించారు..