హీరో విశ్వక్ సేన్ తన 10వ సినిమా కోసం, నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో చేతులు కలిపారు. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. పలువురు ప్రత్యేక అతిథులు సమక్షంలో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్ తాళ్లూరి సతీమణి రజనీ క్లాప్ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకు ముందు రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభిం చడానికి దర్శకుడికి స్కిప్ట్ర్ను అందజేశారు. కామెడీ యాక్షన్ ఎంటర్ -టైనర్ సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.
ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఇది కామెడీ యాక్షన్ ఎంటర్ -టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో కెల్లా భిన్నంగా వుంటు-ంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం. అన్నారు
దర్శకుడు రవితేజ మాట్లాడుతూ.. నన్ను నమ్మి సినిమా ఇచ్చిన విశ్వక్ సేన్ గారికి, నిర్మాత రామ్ తాళ్లూ రి గారికి కృతజ్ఞతలు తెలిపారు
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ: రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. విశ్వక్ సేన్ గారితో ఎప్పటి నుంచో పని చేయాలని వుండేది. ఈ సినిమాతో అది కుదిరింది. అన్నారు
నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నాకు ఇష్టమైన హీరో. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటు-న్నాం. ఈ సినిమాని ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గకుండా వుంటు-ంది. పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.