కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కూడా రోజు రోజుకి ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పోలీసులు…మాస్కులు తప్పనిసరి అంటూ ప్రచారం చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. అయితే జనాలు మాత్రం వీటిని కేర్ చేయట్లేదు మాస్క్ పెట్టకుండానే రోడ్డుపై యధావిధిగా తిరుగుతున్నారు.
దీంతో ఏపీ పోలీసులు మాస్కు పెట్టుకొని వారికి ఫైన్ లు వేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే మాస్క్ లేకుండా తిరుగుతున్న 3500 మందికి ఫైన్ వేసారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని.. పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ విశాఖ వాసులు మాత్రం ఫైన్ లు వేస్తున్నా సరే మాస్క్ లేకుండానే రోడ్డుపై కనిపిస్తున్నారు.