విశాఖపట్నం/ఉక్కునగరం, ప్రభన్యూస్ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరో కొత్త రికార్డు సృష్లించి వార్తల్లోకెక్కింది. ఓ పక్క విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నేపద్యంలో వద్దని కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగ పోరాటం చేస్తున్న ఉక్కు కర్మాగారం ఉత్పత్తి నేపద్యంలోరికార్డులపై రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉత్సాదకతో హాట్ మెటల్ బ్లాక్ఫర్నేస్ 2 కృష్ణ వినూత్నమైన రికార్డును సొంతం చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్టు ఫర్నేస్ 2 (కృష్ణ) ప్రారంభం నుంచి మొదటి సారి గత మూడు రోజుల్లో ప్రతి రోజూ 8,000 టన్నులకు పైగా హాట్ మెటల్‌ను స్థిరంగా ఉత్పత్తి చేయడం చేస్తుంది. దీంతో మరో కొత్త రికార్డుకు నాంది పలికినట్లు అయ్యింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని ఆర్ఐఎన్ఎల్కు చెందిన బ్లాస్టు ఫర్నేస్2 (కృష్ణ) 2022 డిసెంబరు 6,7,8తేదీల్లో వరుసగా 8,030, 8,100, 8,500 టన్నుల ఉత్పత్తిని సాధించడం విశేషం.
బ్లక్ ఫర్నేస్ కార్మికులు, అధికారుల సమిష్టి కృషి దీనికి కారణంగా చెబుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం డిసెంబరు 8వ తేదీన 16,200 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తినిఆ సాధించడం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఇదొక ఘన కీర్తిగా విశాఖ ఉక్కు కార్మాగారం పేర్కొంది. అంతకు ముందు బ్లాక్ ఫర్నేస్ 1,2 కలిపి ఈనెల 8వ తేదీన సాధించినర 15,700 టన్నులు సాధించిన మునుపటి ఉత్తమ రోజువారీ హాట్ మెటల్ ఉత్పత్తి రికార్డును తిరగారసిన ఘనత ను సొంతం చేసుకున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్ ఆపరేషన్స్ ఏకే సక్సేనాలు కొత్త రికార్డుకు కారణమైన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.