Friday, November 22, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ 2022-23లో నష్టాల్లో నడుస్తోంది.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ 2022-23లో నష్టాల్లో నడుస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అధిక నిర్వహణ వ్యయం, తక్కువ అమ్మకాలు, ముడి సరుకు అధిక ధరలు, రుణ సేవల వ్యయం పెరగడం, మూలధనం లోటు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు ఈ నష్టాలకు కారణమని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమపై విశాఖ ఉక్కు ఉద్యోగుల తరఫున బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సోమవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే రాతపూర్వక సమాధానమిచ్చారు.

తమకు సొంతంగా గనులు కేటాయించాలని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) ఒడిశా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కోరిందని చెప్పారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ కూడా ఒడిశా రాష్ట్రాన్ని గనులు కేటాయించాల్సిందిగా కోరిందని, మూలధనం లోటు గురించి స్టీల్ ప్లాంట్ సంబంధిత బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోందని కేంద్రమంత్రి చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement