కాబూల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు వీసాలు వస్తాయేమోనని ఏడాది నుంచి అఫ్గాన్ విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. అయితే, అఫ్గాన్‌లో పరిస్థితులు కుదట పడనందున వారు స్వదేశం వెళ్ళేందుకు వీలు పడటం లేదు. 2021 ఆగస్టు తర్వాత వీసాలు జారీ చేయడం నిలిపివేశారు. అఫ్గాన్‌లో దౌత్య కార్యాలయం కార్యకలాపాలను జూన్‌లో ప్రారంభించారు. అయితే, భారత్ 300 వీసాలను మాత్రమే జారీచేసింది. వీసాల గురించి భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకుని వెళ్ళినట్టు భారత్‌లో అఫ్గాన్ రాయబారి ఫరీద్ తెలిపారు. వీసాల మంజూరులో సరళ వైఖరిని అనుసరించాలని భారతప్రభుత్వాన్ని ఆయన కోరారు.
అయితే, అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా సర్దుమణగక పోవడం వల్ల భారత్ తగిన నిర్ణయాన్నితీసుకోలేకపోతోంది. భారత్‌లో 14వేల మంది అఫ్గాన్ విద్యార్ధులు 73 యూనివర్శిటీల్లో చదువుతున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి ముందు నుంచి వారు కొనసాగుతున్నారు.