Tuesday, November 19, 2024

ఖమ్మంలో విరాట్ కోహ్లీ 60 అడుగుల పెయింటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!

ప్రస్తుతం క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రారాజు అంటే విరాట్ కోహ్లీనే. ఏ ఫార్మాట్ అయినా విరాట్ కోహ్లీ బ్యాట్‌ పరుగులు రాబడుతూనే ఉంటుంది. టీమ్ ఇండియాకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఈ రైట్ హ్యాండ్ ఛాంపియన్ ప్లేయర్ ముందుకెళ్లి ఆ పరిస్థితి నుంచి జట్టును గట్టెక్కిస్తాడు.. అలనే ఎన్నో కష్టతరమైన మ్యాచ్‌లను గెలిపించాడు. అతని ప్రతిభ, నైపుణ్యం కారణంగా తరచుగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతూ ఉంటారు అభిమానులు. కాగా, తాజాగా విరాట్ కోహ్లి గౌరవార్థం ఆయన 60 అడుగుల పెయింటింగ్‌ను ఖమ్మం, తెలంగాణలో తయారు చేశారు.

ఖమ్మం నగర గోడలపై విరాట్ కోహ్లీ బొమ్మ మెరిసిపోతుంది. ఇది ఖమ్మం నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో వేసిన పెయింటింగ్. పట్టణాల సుందరీకరణలో భాగంగా ఈ వాల్ పెయింటింగ్ ను నగరంలో వేశారు. JNTU లో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసిన స్వాతి, విజయ్ఈ 60 అడుగుల కింగ్ కోహ్లి బొమ్మను వేశారు. ఇది ఇప్పుడు ఖమ్మానికే అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ పెయింటింగ్ ఏమి చెప్పాలో చాలా అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ పెయింటింగ్‌ని అభిమానులు కూడా చాలా ఇష్టపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement