Friday, November 22, 2024

విరాట్ కు ఇదే లాస్ట్ ఛాన్స్..లేదంటే కెప్టెన్సీ గోవిందా

కెప్టెన్‌గా త‌న‌కు ఈ ఐపీఎల్ చివ‌రిద‌ని యూఈఏ అంచె మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే అత‌డు త‌ప్పుకోవ‌డం కాదు.. ఆర్సీబీ మ‌రొక్క మ్యాచ్ చెత్త‌గా ఆడినా టీమ్ మేనేజ్‌మెంటే అత‌న్ని త‌ప్పించ‌డం ఖాయం అని ఓ మాజీ క్రికెట‌ర్ అన‌డం గ‌మ‌నార్హం. అసలయితే ఇండియ‌న్ టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి చెప్పుకోద‌గిన రికార్డే ఉంది. మూడు ఫార్మాట్ల‌లోనూ అత‌డు టీమ్‌కు మంచి విజ‌యాలు సాధించి పెట్టాడు. ఐసీసీ ట్రోఫీ లేద‌న్న అప‌వాదు త‌ప్ప అత‌ని కెప్టెన్సీపై పెద్ద‌గా మ‌ర‌క‌ల్లేవు. అయితే ఐపీఎల్ ప‌రిస్థితి అందుకు భిన్నం. అత‌ని కెప్టెన్సీలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ ప్ర‌ద‌ర్శ‌న దారుణం.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ చేతుల్లో ఆర్సీబీ దారుణంగా ఓడ‌టంతో ఆ టీమ్‌పై, విరాట్ కెప్టెన్సీపై విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ఎలాంటి ఫైట్ లేకుండానే ఆర్సీబీ చేతులెత్తేసింది. కేవ‌లం 92 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన విరాట్‌.. బ్యాట్‌తోనూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో ప్ర‌స్తుతం ప‌రిస్థితి చూస్తుంటే కోహ్లిని కెప్టెన్సీ నుంచి త‌ప్పించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వార్తా సంస్థ ఐఏఎన్ఎస్‌తో పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని ఆ మాజీ క్రికెట‌ర్ అన్నాడు. ఇప్ప‌టికే వ‌చ్చే సీజ‌న్ నుంచి కెప్టెన్‌గా ఉండ‌బోన‌ని అత‌డు ప్ర‌క‌టించిన స‌మ‌యాన్ని గంభీర్‌లాంటి మాజీలు త‌ప్పుప‌డుతుండ‌గా.. ఈ మాజీ క్రికెట‌ర్ మాత్రం మ‌రిన్ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

కోల్‌క‌తాతో మ్యాచ్‌లో వాళ్లు ఆడిన తీరు చూడండి. ఏం చేయాలో పాలుపోనట్లు క‌నిపించారు. చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. కోహ్లిని సీజ‌న్ మ‌ధ్య‌లోనే కెప్టెన్సీ నుంచి తొల‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో ఇత‌ర టీమ్స్ విష‌యంలో ఇలా జ‌రిగింది. దినేష్ కార్తీక్‌ను కేకేఆర్‌, స‌న్‌రైజ‌ర్స్ డేవిడ్ వార్న‌ర్‌ను తొల‌గించాయి. కొంద‌రిని తొల‌గించారు. మ‌రికొంద‌రు వాళ్ల‌కు వాళ్లుగా త‌ప్పుకున్నారు. ఆర్సీబీ విష‌యంలోనూ అదే జ‌ర‌గొచ్చు. మ‌రొక్క మ్యాచ్ చెత్త‌గా ఆడారంటే కోహ్లిని క‌చ్చితంగా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారు అని ఆ మాజీ క్రికెట‌ర్ స్ప‌ష్టం చేశాడు.

ఇది కూడా చదవండి: Big Boss5: ఈ వారం నామినేషన్ లోకి వచ్చిందెవరంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement