టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు లభించిన కెప్టెన్‌లలో కోహ్లి ఒకడని అంటూనే.. అతడి వైఫల్యాలను రైనా ఎత్తి చూపాడు. విరాట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ముందు అతనికి మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా ఇలా స్పందించాడు. అతడు నంబర్ వన్ కెప్టెనే. అతడు చాలా సాధించాడని రికార్డులే చెబుతున్నాయి. విరాట్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ కూడా.
అందరూ ఐసీసీ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నారు కానీ విరాట్ కోహ్లీ కనీసం ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయాడని రైనా గుర్తుచేశాడు. కానీ కోహ్లీకి మరింత సమయం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. రానున్న రోజుల్లో 2,3 వరల్డ్‌కప్స్ జరగనున్నాయని.. రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, ఒక వన్డే వరల్డ్‌కప్ ఉన్నాయన్నాడు. సదరు టోర్నీలలో భారత్ ఫైనల్ చేరడం అంత సులభం కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందని రైనా అభిప్రాయపడ్డాడు.
ఈ వార్త కూడా చదవండి: జకోవిచ్ ఖాతాలో 20వ గ్రాండ్ శ్లామ్ టైటిల్