టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్‌పై విమర్శలు గుప్పించే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్… తొలిసారి ప్రశంసలు కురిపించాడు. రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడని చెప్పుకొచ్చాడు. బ్యాటర్లందరూ విఫలమైన వేళ.. తన శైలికి భిన్నంగా.. ఓపికగా ఆడుతూ.. ఒంటరి పోరాటం చేశాడని తెలిపాడు. విరాట్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాయని, అహం వదిలేసి ఆడాడని మెచ్చుకున్నాడు. జట్టుకు ఎంతో విలువైన అర్ధ సెంచరీ నమోదు చేయడం సంతోషించాల్సిన విషయం అన్నారు.
క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు. షాట్ సెలెక్షన్ కూడా ఎంతో బాగుందని చెప్పాడు. విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆటగాళ్లు తమ ఈగోను వదిలేసి వెళ్లాలని కోహ్లీ ఇంతకుముందే చెప్పాడని గుర్తు చేశాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా ఇదే మాట అన్నాడని, ఆ మాటను కోహ్లీ నిరూపించుకున్నాడని, ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడంటూ కొనియాడాడు. సఫారీ బౌలర్లు సవాల్ విసిరినా.. పట్టించుకోలేని, వారిపై ఆధిపత్యం చెలాయించకుండా తన పని తాను చేసుకుపోయాడని చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital