వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఓ ఆందోళన కలిగించే వార్త. నెట్ ప్రాక్టీస్‌లో షమి విసిరిన బౌన్సర్‌కు విరాట్ కోహ్లి గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, అతడు మూడు నుంచి ఆరు వారాలు దూరం కావాల్సి వస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షమి విసిరిన బంతి కోహ్లి పక్కటెముకలకు బలంగా తగిలిందని వస్తున్న వార్తలు పుకార్లే అని ఇదే షోలో పాల్గొన్న విక్రాంత్ గుప్తా చెప్పారు.
ఒకవేళ కోహ్లికి గాయం అన్నది నిజమైతే మాత్రం ఇండియన్ టీమ్ పెద్ద దెబ్బ పడినట్లే. రెండు రోజులుగా టీమిండియా సభ్యులంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం కూడా కోహ్లి, షమితోపాటు బుమ్రా, గిల్ వంటి ప్లేయర్స్ నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ నెల 18న ఫైనల్ ప్రారంభం కానుండగా.. అక్కడి మేఘావృతమైన వాతావరణానికి అలవాటు పడటానికి టీమ్‌కు వారం రోజుల సమయం ఉంది. కోహ్లి గాయంపై వస్తున్న వార్తలపై బీసీసీఐ ఏదైనా ప్రకటన ఇస్తుందా లేదా చూడాలి.